Mohanbabu family disputes: మోహన్ బాబు ఇంటికి మనోజ్ రాకతో ఉద్రిక్తత, మీడియాపై దాడి

మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి టెన్షన్ నెలకొంది. పోలీస్ అధికారులను కలిసి తిరిగి జల్ పల్లికి వచ్చిన మనోజ్ దంపతులు.

Update: 2024-12-10 14:24 GMT

  Mohanbabu family disuputes: మోహన్ బాబు ఇంటికి మనోజ్ రాకతో ఉద్రిక్తత

 మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి టెన్షన్ నెలకొంది. పోలీస్ అధికారులను కలిసి తిరిగి జల్ పల్లికి వచ్చిన మనోజ్ దంపతులు. గేటు ఓపెన్ చేయకపోవడంతో కొద్దిసేపు కారులోనే వెయిట్ చేశారు. గేటు ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఏడు నెలల పాప ఇంట్లోనే ఉందని మనోజ్ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. గేటు తీయాలని భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత గేట్ ను తోసుకొని లోపలికి వెళ్లారు. ఈ సమయంలో గేటు బయటకు వచ్చిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులతో దురుసుగా వ్యవహరించారు. ఓ మీడియా చానల్ మైక్ లాక్కొని దాడికి దిగారు. ఈ ఘటనలో కొందరు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

చిరిగిన చొక్కాను పోలీసులకు చూపిన మనోజ్

గేట్ లోపలికి వెళ్లిన తనపై దాడి జరిగిందని మనోజ్ ఆరోపించారు. మీడియాకు, పోలీసులకు తన చిరిగిన చొక్కా చూపించారు. దీనిపై మనోజ్ మీడియాతో మాట్లాడేందుకు గేటు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మోహన్ బాబు గేటు బయటకు వచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆవేశంతో ఊగిపోయి మోహన్ బాబు మీడియాపై దాడి చేశారు. మంగళవారం ఉదయం కూడా  తన ఇంటికి మీడియా ఎందుకు వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలోని సమస్యను తాము పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. మీడియా ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

గన్ సీజ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశం

మోహన్ బాబు, విష్ణు గన్ లను సీజ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మంచు కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మోహన్ బాబు ఇంట్లో ఉన్న బౌన్సర్లను పోలీసులు పంపించివేశారు. మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన తర్వాత జల్ పల్లి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మూడు రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News