Hijra Founder Chandramukhi: బిగ్ బాస్ ప్రియాంక సింగ్ కు మేము సపోర్ట్ చేయం
*ప్రియాంక సింగ్ కు తమ కమ్యూనిటీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదని తెలంగాణా రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాక్ ఇచ్చారు
Hijra Founder Chandramukhi: బిగ్ బాస్ ప్రియాంక సింగ్ కు మేము సపోర్ట్ చేయం
Hijra Founder Chandramukhi: బిగ్ బాస్ సీజన్ 5 లో ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ కు తమ కమ్యూనిటీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదని తెలంగాణా రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాక్ ఇచ్చారు. కొన్ని కామెడీ షోలలో చీరలు కట్టుకొని కొద్ది రోజులకు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయిన సాయితేజ ఎవరో ఇప్పటి వరకు తనకు తెలియదని, ఇటీవల టివిలలో చూడటం తప్ప తనతో అసలు పరిచయం లేదని చంద్రముఖి కామెంట్ చేసింది.
ట్రాన్ జెండర్ గా మారడం మాములు విషయం కాదని.., ట్రాన్స్ జెండర్ గా మారాలని ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే దాదాపుగా రెండు మూడేళ్ళు రకరకాలుగా కౌన్సిలింగ్ ఇస్తాడని ఆ తరువాత కూడా ఆపరేషన్ చేయించుకోవాలని అనిపిస్తేనే ట్రాన్స్ జెండర్ గా మారాలని సూచిస్తారని తెలిపింది. ప్రస్తుతం చాలా మంది డబ్బులు సంపాదించడానికి అమ్మాయిల వేషం వేసుకొని బిక్షాటన చేయడం, వ్యభిచారం వంటివి చేయడం వలన డబ్బులు సంపాదించవచ్చని అనుకుంటున్నారని ఆమె తెలిపింది. ఏదో కొన్ని రోజులు చీరలు కట్టుకొని అమ్మాయిల నటించి ట్రాన్స్ జెండర్ గా మారడం వేరే విషయమని తెలిపింది. ప్రియాంక సింగ్ తమ కమ్యూనిటీలో ఉండి ఉంటె తప్పక సపోర్ట్ చేసేవాళ్ళమని ఆమె మా కమ్యూనిటీలో లేనందువలనే మేము సపోర్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చింది.