Navdeep: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Navdeep: డ్రగ్స్ కేసులో ఊరట కల్పించాలంటూ నవదీప్ పిటిషన్
Navdeep: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. నవదీప్ పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం. డ్రగ్స్ కేసులో పోలీసు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశింది. 41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు లింకులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో తనకు ఊరట కల్పించాలంటూ నవదీప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నవదీప్ పిటిషన్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. వాదనల అనంతరం నవదీప్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. 41 నోటీసులు ఇచ్చి విచారణ జరపొచ్చని తెలిపింది. కానీ అరెస్టు చేయరాదని హైకోర్టు పేర్కొంది.