OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ఓదెల 2.. జాతీయ స్థాయిలో రెండో స్థానం
OTT: అందాల తార తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓదెల 2. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.
OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ఓదెల 2.. జాతీయ స్థాయిలో రెండో స్థానం
OTT: అందాల తార తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓదెల 2. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఘనవిజయం సాధించింది. మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెండు వారాలుగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఓదెల స్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఓదెల 2, మిస్టికల్ యూనివర్స్‌ను మరింత డార్క్ అండ్ ఇంటెన్స్‌గా చూపించింది. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది పర్యవేక్షించారు. ఇందులో తమన్నా ఒక నాగసాధు పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
ఈ చిత్రం ఓటీటీలో బాగా పాపులర్ అయింది. ఒర్మాక్స్ మీడియా విడుదల చేసిన మే 12–18 వారపు వ్యూయర్ షిప్ రిపోర్ట్ ప్రకారం, ఓదెల 2కి 38 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది నేషనల్ స్ట్రీమింగ్ చార్ట్‌లో రెండవ స్థానం దక్కించుకుంది. రెండో వారంలోనూ ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మధు క్రియేషన్స్ , సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంస్థలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాయి. తమన్నాతో పాటు హేబా పటేల్, వశిష్ట ఎన్సీ సింహా కీలక పాత్రల్లో కనిపించారు.