Retro in OTT: ఓటీటీలోకి సూర్య రెట్రో.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్ప‌టి నుంచంటే..?

Retro in OTT: కోలీవుడ్ స్టార్‌ సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రెట్రో’. మే 1వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది.

Update: 2025-05-26 06:10 GMT

Retro in OTT: ఓటీటీలోకి సూర్య రెట్రో.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్ప‌టి నుంచంటే..?

Retro in OTT: కోలీవుడ్ స్టార్‌ సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రెట్రో’. మే 1వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయినా టెక్నిక‌ల్‌గా మాత్రం ఈ సినిమాకు మంచి గుర్తింపు ల‌భించంద‌ని చెప్పాలి.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీపై రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్న తరుణంలో, నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారిక ప్రకటన చేస్తూ తేదీని ఖరారు చేసింది. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నటులు జయరామ్, నాజర్, ప్రకాశ్ రాజ్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో క‌నిపించారు. థియేట‌ర్ల‌లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీ విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

క‌థేంటంటే.?

పారి అలియాస్ పార్వేల్ కన్నన్‌ (సూర్య) చిన్ననాటి నుంచి అనాథగా పెరిగిన వ్యక్తి. తల్లిదండ్రులను కోల్పోయిన పారి, పుట్టిన ఊరి నుంచి దూరమై జీవితం గడుపుతున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ అయిన తిలక్‌ (జోజు జార్జ్) భార్య కోరికపై అతన్ని దత్తత తీసుకుంటాడు. మొదట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తిలక్‌, ఓ ప్రమాదకర పరిస్థితిలో పారి తన ప్రాణాలను రక్షించడంతో, అతనిపై సానుభూతి కలిగి, తన సొంత కొడుకులా చూడటం ప్రారంభిస్తాడు.

అనంతరం తిలక్ పెంపకంలో పారి మరో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అదే సమయంలో రుక్మిణి (పూజా హెగ్డే) అనే యువతిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత హింస, నేరాల జీవనశైలికి ముగింపు చెప్పాలని, తన భార్యతో ప్రశాంత జీవితం గడపాలని నిర్ణ‌యం తీసుకుంటాడు.

అయితే అతని గతం అంత సులభంగా వదలదు. పారి నిజంగా హింసకు దూరమైన జీవితం గడపగలిగాడా? అత‌ని జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది లాంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Tags:    

Similar News