ఈ నియమాలు పాటించండి సంతోషంగా ఉండండి... మహేశ్ బాబు ట్వీట్!

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి.

Update: 2020-03-25 11:57 GMT
Mahesh Babu (File Photo)

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గుంపులు గుంపులుగా బయటకు రావొద్దని, కుటుంబ నుంచి ఒక్కరే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

అయితే ప్రధాని మోడీ లాక్ డౌన్ గురించి మత్లడుతూ... దేశ భవిష్యతు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి, అది వ్యాపించకుండా కొన్ని సార్లు కటిన చర్యలు తెసుకోవాల్సి వస్తుంది అని తెలిపారు. అందులో భాగంగానే ఇరవై ఒక్క రోజులు భరత్ లాక్ డౌన్ గా ప్రకటించారు. అంటే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసుగుతుంది.

కరీనా వైరస్ ప్రభావం పై, అది దేశంలో వ్యాపిస్తున్న దానిపై తెలుగు చిత్ర సీమ కూడా ముందుకు వచ్చి కరోనా పై అవగాహన, తెసుకోవలసిన జగ్రతలపై పలు వీడియోలు, ట్వీట్లు చేసారు. ఇందులో భాగం గానే మెగాస్టార్ చిరంజీవి కరోన పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్విట్టర్ వీడియో చేసారు.

ఇప్పుడు అదే విధంగా సూపర్ స్ట్రార్ మహేష్ బాబు కూడా ప్రజలకు మరియు అభిమానులకు కరోనా పై ట్వీట్ చేసారు. ఈ రోజు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు త్తెలిపారు. అలాగే కరోనా జాగ్రత్తలో భాగంగా ఆరు నియమాలతో ట్వీట్లు చేసారు. "అందరికీ ఉగాది శుభాకాంక్షలు !! ఇలాంటి విపరీత పరిస్థితుల్లో #FightAgainstCoronavirus గురించి మీ అందరికీ ఈ 6 విలువైన నియమాలను పాటించమని కోరుతున్నాను''. అని ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు ట్వీట్చే చేసారు.

మహేష్ బాబు చెప్పిన ఆరు విలువైన నియమాలు:

ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి.

♦  20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోవాలి.

♦ మీ ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును అసలు తాకవద్దు.

♦ దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ మోచేతులను లేక టిష్యూను అడ్డుగా పెట్టుకోండి.

♦ సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకోండి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

♦  మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్ ని వాడండి. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని సంప్రదించండి.


 

Tags:    

Similar News