SSMB 29: మహేష్ సినిమా కోసం జక్కన్న భారీ ప్లాన్.. రోజురోజుకీ పెరుగుతోన్న హైప్
SSMB 29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఊహకందని అంచనాలు ఉన్నాయి.
SSMB 29: మహేష్ సినిమా కోసం జక్కన్న భారీ ప్లాన్.. రోజురోజుకీ పెరుగుతోన్న హైప్
SSMB 29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన చేయకపోయినా అంచనాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.
SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక భాగం వారణాసి నేపథ్యంగా ఉంటుందని సమాచారం. గంగా నది ఒడ్డున, ఆలయాలు, ఘాట్‌లు కలిగిన ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కలిగిన ప్రాంతాన్ని తెరపై చూపించాలంటే రియల్ లొకేషన్లలో షూటింగ్ చేయడం చాలా కష్టం. అనుమతుల సమస్యలు కారణాల వల్ల రాజమౌళి వారణాసి సెటప్‌ను హైబ్రిడ్ మోడల్‌గా నిర్మించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
వారణాసి సెటప్‌లో దేవాలయాల నిర్మాణం, ఘాట్‌ల డిజైన్, నదీ తీరపు రియాలిటీ అన్నింటినీ అద్భుతంగా మలిచేలా రాజమౌళి టీమ్ కసరత్తులు చేస్తోంది. ఈ భారీ సెటప్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్లు తీసుకుంటున్నారు. రియలిస్టిక్ లుక్, విజువల్ గ్రాండియర్‌ను కలపాలని రాజమౌళి ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు నిర్మాతగా కె.ఎల్. నారాయణ వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. హీరోగా మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.