Game Changer: గేమ్ ఛేంజర్ పై తమన్ ఆసక్తికర ట్వీట్
SS Thaman-Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది.
Game Changer: గేమ్ ఛేంజర్ పై తమన్ ఆసక్తికర ట్వీట్
SS Thaman-Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. దీనిపై సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ ఛేంజర్‌గా మారుస్తుందని ట్వీట్ చేయడంతో దీనిపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
దోప్ అంటూ సాగే ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం విడుదల అవుతుందని.. ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందన్నారు తమన్. ఇప్పటికే విడుదలైన జరగండి, రా మచ్చా, నానా హైరానా పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ ట్వీట్ తర్వాత.. నాలుగో సాంగ్ వీటిని మించి ఉండడం ఖాయమని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని.. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.