RC15 Movie: రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి తమన్ సంగీతం

Update: 2021-07-19 08:45 GMT

రామ్ చరణ్ - శంకర్ చిత్రంలో తమన్ (ట్విట్టర్ ఫోటో)

RC15 Movie: శంకర్ దర్శకత్వంలో విడుదలైన "బాయ్స్" సినిమాలో నటుడి నుండి నేడు శంకర్ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎదిగాడు మన తెలుగు సంగీత దర్శకుడు తమన్. తాజాగా వరుస సినిమాలకు తన అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న తమన్ తాజాగా శంకర్ దర్శకత్వంలో త్వరలో రామ్ చరణ్ హీరోగా తెరకేక్కబోతున్న చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ "గని", మహేష్ బాబు "సర్కార్ వారి పాట" తో పాటు అక్కినేని అఖిల్ "ఏజెంట్" చిత్రాలకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన "వకీల్ సాబ్" చిత్రానికి తమన్ తన సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఇక గతంలో రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన "బ్రూస్ లీ" చిత్రానికి తమన్ తన సంగీతాన్ని అందించాడు. ఇక శంకర్ దర్శకత్వంలో " బాయ్స్" సినిమాలో నటించిన తమన్, శంకర్ నిర్మాతగా వ్యవహరించిన "వైశాలి" చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమవడం, తాజాగా శంకర్ దర్శకత్వంలో సంగీత దర్శకుడిగా మొదటి సినిమా చేయడం కొసమెరుపు. ఇప్పటికే చిత్ర యూనిట్ తో కలిసిన తమన్ రామ్ చరణ్ 15వ చిత్రం కోసం తన బాణీలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

Tags:    

Similar News