Sreeleela: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. బాలీవుడ్ లో మరోస్టార్ హీరోతో ఛాన్స్ ?

Sreeleela: హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం మల్టీలింగ్యువల్ స్టార్‌గా వెలుగుతోంది. కన్నడలో పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Update: 2025-07-26 01:51 GMT

Sreeleela: హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం మల్టీలింగ్యువల్ స్టార్‌గా వెలుగుతోంది. కన్నడలో పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఆమెకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది శ్రీలీల. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ ఆమెను వరించింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో కలిసి శ్రీలీల సినిమా చేయబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, శ్రీలీలతో పాటు బాబీ డియోల్ కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురు స్టార్స్ కలయికతో సినిమాపై అంచనాలు భారీగా పెరగడం సహజం. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.

శ్రీలీల మంచి డాన్సర్. గ్లామర్, నటన రెండింటిలోనూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాలోని పాటలో అదిరిపోయే స్టెప్పులతో ఉత్తర భారతదేశంలోనూ తన టాలెంట్‌ను చూపించింది. రోజురోజుకు ఆమె పాపులారిటీ పెరుగుతోంది. అందుకే ఆమెకు ఆఫర్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. రణవీర్ సింగ్, బాబీ డియోల్, శ్రీలీల నటించబోయే ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ఇందులో యాక్షన్, డ్రామా పుష్కలంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. మంచి డిమాండ్ ఉన్న ఈ ముగ్గురు స్టార్స్ ఈ చిత్రంలో ఉండటంతో, టైటిల్ ప్రకటించకముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రణవీర్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల అతని దురందర్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. డాన్ 3 సినిమాలో కూడా రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు శ్రీలీలతో కొత్త సినిమా వార్త విని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Tags:    

Similar News