Sreeleela:ప్రతిరోజు ఇదే తింటాను శ్రీలీల క్యూట్ వీడియో వైరల్..

శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రి ఇచ్చారు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Update: 2025-02-20 11:42 GMT

ప్రతిరోజు ఇదే తింటాను శ్రీలీల క్యూట్ వీడియో వైరల్..

Sreeleela: శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రి ఇచ్చారు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పల్లీల పొడిని కారంలో కలుపుకుని తింటున్న వీడియోను శ్రీలీల టీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. శ్రీలీలకు పల్లి పొడి, కారం అంటే చాలా ఇష్టమంట. రోజు ఇది ఒక్కటి ఉంటే చాలు తినేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారండీ అంటూ ఎంతో క్యూట్‌గా అడిగింది శ్రీలీల. ఈ వీడియో వైరల్ కావడంతో శ్రీలీల అమాయకత్వాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

రాబిన్ హుడ్ మూవీని వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో మినిమం గ్యారెంటీ అని అంతా అనుకుంటున్నారు. కావాల్సినంత వినోదంతో పాటు చివర్లో ఏదైన చిన్న సందేశం ఇస్తే ఇవ్వొచ్చు అని టాక్. ఇక రాబిన్ హుడ్ టీజర్, పాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. శ్రీలీల, నితిన్ గతంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటించారు. కానీ అది డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల జెడ్ స్పీడ్‌తో పలు సినిమాల్లో నటించారు. స్టార్ హీరోల సరసన కూడా నటించారు. శ్రీలీలకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడుతూనే వచ్చాయి. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వరుస ఫ్లాపులతో ఆ మధ్య కొంచె స్పీడ్ తగ్గినా.. పుష్ప2 సినిమాలోని ఐటెం సాంగ్‌తో మళ్లీ పుంజుకున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్నారు.

పుష్ప2 ఐటెం సాంగ్ తర్వాత శ్రీలీల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు.

శ్రీలీల తెలుగులో ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్. ఇక బాలీవుడ్ మూవీకి కేవలం రూ.1.75 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని సమాచారం. అయితే బాలీవుడ్‌లో మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్‌కు ఒప్పకున్నారని టాక్. 


Tags:    

Similar News