Single movie Collections: శ్రీ విష్ణు దుమ్మురేపుతున్నాడుగా.. సింగిల్ రెండు రోజుల వ‌సూళ్లు ఎంతంటే

Single movie Collections: వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న శ్రీ విష్ణు నటించిన "సింగిల్" సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధిస్తోంది.

Update: 2025-05-11 06:30 GMT

Single movie Collections: శ్రీ విష్ణు దుమ్మురేపుతున్నాడుగా.. సింగిల్ రెండు రోజుల వ‌సూళ్లు ఎంతంటే

Single movie Collections: వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న శ్రీ విష్ణు నటించిన "సింగిల్" సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధిస్తోంది. విడుదలైన మొదటి రోజే మంచి ఓపెనింగ్ సాధించిన‌ ఈ సినిమా, రెండో రోజు కూడా వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.4.15 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజున రూ.7.05 కోట్లు దక్కించుకుంది. ఇలా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.11.20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు నమోదు చేసింది.

"సింగిల్" హిట్‌కు కారణాలు ఏంటంటే?

కార్థిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా స‌ర‌దాగా సాగుతుంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య సీన్లు ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి. స‌మ్మ‌ర్ హాలీడేస్ ఉండ‌డం, పోటీగా పెద్ద సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో సింగిల్ మూవీ క‌లెక్ష‌న్లు దూసుకెళ్తున్నాయి.

అమెరికాలో సైతం మంచి వసూళ్లు:

USAలో ఈ చిత్రం ఇప్పటికే $300,000 (సుమారుగా రూ.2.5 కోట్లు) మార్క్‌ దాటి, వీకెండ్‌ ముగిసేలోపు $500K దిశగా దూసుకెళ్తోంది. ఇది శ్రీ విష్ణు కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లోనే అత్యుత్తమమైన USA ఓపెనింగ్ ఇదే కావ‌డం విశేషం.

కాగా సింగిల్ వ‌సూళ్లు మ‌రింత పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఆదివారం కావడంతో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 24 గంటల్లో 80,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వేసవి సెలవులు కూడా సినిమా హిట్‌కు కలిసొస్తున్నాయి. మ‌రిన్ని స్క్రీన్స్ పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News