Single Movie Collections: థియేటర్లకు క్యూ కడుతోన్న ప్రేక్షకులు.. సింగిల్ కలెక్షన్ల సునామి..!
శ్రీ విష్ణు తాజా హాస్యభరిత చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ జోరుగా దూసుకుపోతోంది.
Single Movie Collections: థియేటర్లకు క్యూ కడుతోన్న ప్రేక్షకులు.. సింగిల్ కలెక్షన్ల సునామి
Single Movie Collections: శ్రీ విష్ణు తాజా హాస్యభరిత చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ జోరుగా దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనూ ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ, శ్రీ విష్ణు కెరీర్‌లోనే మరో బిగ్ హిట్‌గా నిలిచింది.
సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో గ్లోబల్‌గా రూ.16.3 కోట్లు వసూలైనట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మొదటి రోజు: ₹4.15 కోట్లు, రెండవ రోజు: ₹7.05 కోట్లు, మూడవ రోజు: ₹5.1 కోట్లు సాధించింది. కాగా ఈ సినిమా వారం రోజుల్లోపై రూ. 20 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ట్రేడ్ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బుక్ మై షోలో టికెట్ల హవా:
గత 24 గంటల్లోనే 66 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయని బుక్ మై షో పేర్కొంది. మొత్తం టికెట్లు 2 లక్షల మార్క్‌ను దాటేయడం విశేషం. అంతే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో ఇప్పటికే $400K దాటేసిన ‘సింగిల్’, హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను చేరేందుకు వేగంగా పరుగులు తీస్తోంది.
ప్రత్యేకమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పించే శ్రీ విష్ణు, ఈ సినిమాలో తనదైన కామెడి టైమింగ్‌తో మరోసారి అలరించారు. ఆయన నటనకు తోడుగా వెన్నెల కిశోర్ చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలసి కళ్యా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు.
#Single 3 Days official poster 💥💥
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) May 12, 2025
Film has entered into profits in all areas 👍
Heading towards blockbuster 👌
@sreevishnuoffl @caarthickraju @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @vennelakishore pic.twitter.com/k3l0MHVfjt