ఏళ్లు గడిచిన క్రేజ్ తగ్గని జేజెమ్మ.. అనుష్క 15 ఏళ్ల సినీ ప్రయాణం

అనుష్క... ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. తన అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Update: 2020-03-11 14:08 GMT
Anushka Shetty (file photo)

అనుష్క... ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. తన అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ భాషలలో చిత్రాలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఒక అగ్ర కథానాయకుడికి ఉన్న క్రేజ్ ఈ అమ్మడికి ఉంది. హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు అలోచించే దర్శకులకు ముందు అనుష్కనే గుర్తుకు వస్తుంది. ఈ స్వీటీతో భారీ బడ్జెట్  సినిమాలు చేయడంలోనూ నిర్మాతలు వెనుకడుగు వేయ్యరు. 

టాలీవుడ్ లో అనుష్క ప్రస్థానం చూస్తే.. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' చిత్రం తో అనుష్క తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయింది. కెరీర్ మొదట్లోనే రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ళయింది. ఈ పదినేళ్ళలో అమ్మడు ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

విక్రమార్కుడు చిత్రం తరువాత ఆమెకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అరుంధతి, లక్ష్యం, సౌర్యం, చింతకాయల రవి, బలాదూర్, మిర్చి, బిల్లా, వంటి ఎన్నో చిత్రాలు ఆమెను అగ్ర కథానాయకిగా నిలబెట్టాయి. అంతే కాకుండా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు. అందులో చిరంజీవి నటించిన 'స్టాలిన్', నాగార్జున నటించిన 'కేడి', వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు చేయటం అంటే అనుష్కకి చాల ఇష్టం ఈ కోవలోనే ఆ మధ్య 'సైజు జీరో' అనే చిత్రం కోసం సుమారు 20కిలోల బరువు పెరిగింది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే, పాత్రకోసం ఎంత దూరం అయినా వెళ్తాని సంకోచించకుండా తనకు సినిమా పై ఉన్న ప్రేమతో ఎక్స్పెరిమెంటల్ చిత్రాలు చేస్తూనే ఉంది.

2015లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' 'బాహుబలి2' చిత్రం కోసం సుమారు 3సంవత్సరాలు తన కాలాన్ని వేచిచింది. అయితే రెండు భాగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించాయి. ప్రస్తుతం 'నిశబ్ధం' సినిమా చేస్తుంది. ఈ సినిమాతో వచ్చే నెల 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క నుండి వస్తున్న సినిమా కావటంతో ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 



Tags:    

Similar News