జనతా కర్ఫ్యూ పై సెలెబ్రిటీల ట్వీట్లు

కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Update: 2020-03-21 13:08 GMT
Kamal Hassan (file photo)

కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా భారత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే జనతా కర్ఫ్యూకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరు పాటించాలని తద్వారా కరోనా వైరస్ ని అరికట్టేందుకు తోడ్పడాలని కోరుతున్నారు.

అందులో భాగంగా... ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూడా జనతా కర్ఫ్యూ పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కరోనా అవగాహనా పై వీడియో చేసారు. "ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు పూర్తి మద్దతిస్తున్నానని కమల్ హస్సన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి సమైక్యతతో అందరూ ఇంట్లో నే సురక్షితంగా ఉందామని కమల్ పిలుపునిచ్చారు. దీనికి మద్దతు ఇవ్వాలంటూ తన అభిమానులు, మిత్రులను కోరారు. అయితే కమల్ వీడియో కి స్పందిస్తూ నటులు అజిత్, సూర్య, ధనుష్, విజయ్ సేతుపతి, రజినీ కాంత్,శింబు తదితరులు ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు.

ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇక భారత్ లో కూడా 170 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయిదు మరణాల సంభవించాయి. వైరస్ ప్రభావితం ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే స్కూల్స్, ధియేటర్స్, పబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్ మొదలగు వాటిని మార్చి 31 వరకు రద్దు చేశాయి. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత అన్నిటికంటే ముఖ్యమని చెబుతున్నాయి. 








  

Tags:    

Similar News