Soubin Shahir: మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ అరెస్ట్

Soubin Shahir arrested: పాన్‌ ఇండియా విజయవంతమైన చిత్రంగా గుర్తింపు పొందిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు.

Update: 2025-07-09 04:30 GMT

Soubin Shahir: మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ అరెస్ట్

Soubin Shahir arrested: పాన్‌ ఇండియా విజయవంతమైన చిత్రంగా గుర్తింపు పొందిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. సినిమా లాభాల్లో భాగస్వామ్యం హామీపై మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో, షాహిర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

ఎంత లాభం ఇచ్చారని..?

ఫిర్యాదుదారు సిరాజ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, మంజుమ్మల్ బాయ్స్ సినిమా లాభాల్లో 40 శాతం షేర్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ కేవలం రూ. 7 కోట్లు మాత్రమే ఇచ్చి, మిగతా మొత్తాన్ని ఇవ్వకపోవడంతో వంచించారని ఆయన ఎర్నాకుళం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి, సౌబిన్ షాహిర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్ట్ అనంతరం ముందస్తు బెయిల్:

అయితే అరెస్టు తర్వాత షాహిర్, మరికొందరు ఎర్నాకుళం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ముగ్గురికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు తాత్కాలికంగా విడుదలయ్యారు.

‘కూలీ’ షూటింగ్ నడుస్తుండగానే కలకలం

సౌబిన్ షాహిర్ ప్రస్తుతం రజనీకాంత్ 171వ చిత్రం 'కూలీ'లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. 2025 ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

అయితే షూటింగ్ నడుస్తుండగానే ఈ అరెస్టు వ్యవహారం వెలుగులోకి రావడంతో, మలయాళ సినీ వర్గాల్లో కలకలం రేగింది. అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. విషయం తెరపైకి వచ్చిన వెంటనే #SoubinShahir అనే హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Tags:    

Similar News