వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. అన్నమయ్యను అవమానించారంటూ...

*అన్నమయ్య కీర్తనను అసభ్యంగా చూపడం సరికాదు- అన్నమాచార్యుల వంశీయులు

Update: 2022-07-20 06:51 GMT

వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. అన్నమయ్యను అవమానించారంటూ...  

Sravana Bhargavi: అన్నమాచార్యులు సంకీర్తనలతో నేపథ్య గాయని శ్రావణభార్గవి చిత్రీకరించిన ఓ పాటపై అన్నమయ్య వంశస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో 2 లక్షలకు పైగా వ్యూస్ దాటిన ఈ పాట ఇప్పుడు వివాదంగా మారింది. అన్నమాచార్యుల సంకీర్తనలను అవమానించారని అన్నమయ్య వంశస్థులు మండిపడుతున్నారు. త్వరలో టీటీడీ దృష్టికి తీసుకెళ్ళి నిర్ణయం తీసుకోనున్నామని చెబుతున్నారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై భక్తి భావంతో అన్నమాచార్యులు దాదాపు 32 వేల సంకీర్తనలు రచించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చారు. పదకవితా పితామహుడు రచించిన సంకీర్తనలు వింటే చాలు ఎంతటి వారైన తన్మయత్వానికి గురవుతారు. అంతటి అత్యాద్భుతంగా అన్నమయ్య సంకీర్తనలు రచించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని, స్వామి వారి లీలలను కళ్ళకు కట్టినట్లు తన సంకీర్తనల రూపంలో ప్రపంచానికి అన్నమాచార్యులు తెలియజేశారు. దివ్యానుభూతిని కలిగించే స్వామి వారి సంకీర్తనలను కొందరు సినిమాలో పాటల రూపంలో తెరకెక్కించి అసభ్యకరంగా చిత్రీకరించి వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చుతున్నారు. నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కైంకర్యాల్లో స్మరించే సంకీర్తన ఇప్పుడు ఓ పాట రూపంలో అన్నమయ్య వంశస్థులను ఆగ్రహానికి గురి చేసింది. శ్రావణ భార్గవి చిత్రీకరించిన అన్నమయ్య పాట ఇప్పుడు వివాదమవుతోంది.

శ్రావణ భార్గవి "ఒకపరి ఒకపరి వయ్యారమై" అనే పాటతో ఓ వీడియోను చిత్రీకరించారు. తన మనోభావాన్ని కళ్ళలో అభినయిస్తూ ఆ పాటను రూపొందించారు. ఆ పాటను తన యూట్యూబ్ పేజ్‌ను మూడు రోజుల క్రితం పబ్లిష్ చేశారు. శ్రావణ భార్గవి రూపొందించిన ఈ పాటను నెటిజన్లు బానే ఆదరిస్తున్నారు. దీంతో దాదాపుగా ఆ పాట రెండు లక్షలకు మేర వ్యూస్ దాటింది. అయితే ఈ పాటపై అన్నమాచార్యులు వంశస్థులు మండిపడుతున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై భక్తితో పాడిన పాటలను అసభ్యకరంగా చిత్రీకరించారంటూ 12వ తరం అన్నమాచార్యులు వంశీయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం‌ జరిగే సమయంలో స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని వర్ణించిన పాటను ఆమె సౌందర్యాన్ని వర్ణించినట్లు రూపొందించడం చాలా భాధాకరమని అంటున్నారు హరి నారాయణ చార్యులు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News