Simran Natekar: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Simran Natekar: ఎంత పెద్ద హీరో సినిమా అయినా ముందుగా ఈ పాప తెరపై కనిపించాల్సిందే.
Simran Natekar: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Simran Natekar: ఎంత పెద్ద హీరో సినిమా అయినా ముందుగా ఈ పాప తెరపై కనిపించాల్సిందే. థియేటర్‌లో లైట్లు ఆర్పివేయగానే, 'ఈ నగరానికి ఏమైంది... ఒకవైపు పొగ... మరోవైపు నుసి... ఎవరూ మాట్లాడరేంటి...' అంటూ ఓ ప్రకటన అలర్ట్ చేస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఓసారి.. మళ్లీ ఇంటర్వెల్‌లో వచ్చే ఈ యాడ్ అందరికీ తెలిసిందే.
ఈ యాడ్‌లో నటించిన ఓ చిన్నారిని అంత ఈజీగా మరిచిపోలేం. తండ్రి సిగరెట్ తాగుతున్నప్పుడు, ఆ చిన్నారి అమాయకపు చూపు చూసి సిగరెట్ పడేస్తాడు. ఈ యాడ్ చూసి ఎంత మంది స్మోకింగ్ మానేశారో తెలీదు కానీ, ఆ పాపకు మాత్రం చాలా పాపులారిటీ వచ్చింది. ఆ అమ్మాయి పేరు సిమ్రాన్ నటేకర్. 1997లో ముంబైలో జన్మించింది. ఆ ప్రకటన తర్వాత దాదాపు 150కి పైగా విభిన్న ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో పూజా పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత ఆమె క్రిష్ 3 చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2010లో, రితీష్ దేశ్ ముఖర్జీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి నటించిన జానే కహాన్ సే ఆయ్ హైలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఇప్పటికీ సిమ్రాన్ నటేకర్ తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. దీంతో మంచి అవకాశాల కోసం తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఇందుకోసం టాలీవుడ్ యువ దర్శకులతో పలు ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు చాలా క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది.