Shruti Haasan: నన్ను ఐరన్ లెగ్ అన్నారు.. నటి శృతి హాసన్ ఆవేదన

Shruti Haasan: ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని కారణాలను విశ్లేషించకుండా చాలా మంది నటీనటులను నిందించడం చూస్తుంటాం. ఆ హీరోయిన్ వల్లే సినిమా పోయిందన్న మాటలు మనం వినే ఉంటాం.

Update: 2025-07-27 06:30 GMT

Shruti Haasan: నన్ను ఐరన్ లెగ్ అన్నారు.. నటి శృతి హాసన్ ఆవేదన

Shruti Haasan: ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని కారణాలను విశ్లేషించకుండా చాలా మంది నటీనటులను నిందించడం చూస్తుంటాం. ఆ హీరోయిన్ వల్లే సినిమా పోయిందన్న మాటలు మనం వినే ఉంటాం. ఇదే పరిస్థితిని హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎదుర్కొన్నారు. ఆమెను ఐరన్ లెగ్ అని, ఆమె కాలు పెడితే బూడిదే అన్న ఉదాహరణలు లేకపోలేదు. ఆ వ్యాఖ్యలపై ఆమె తాజాగా స్పందించారు. అయితే, ఇప్పుడు శృతి హాసన్ అత్యంత బిజీ హీరోయిన్‌లలో ఒకరుగా కొనసాగుతున్నారు. శృతి హాసన్ బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. హే రామ్ ఆమె నటించిన మొదటి సినిమా. ఇది 2000 సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత 2009లో వచ్చిన లక్ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అయితే, హీరోయిన్‌గా తొలి మూడేళ్లు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అప్పుడే ఆమెను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు.

2012లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. గబ్బర్ సింగ్ తర్వాత శృతి నటించిన సినిమాలకు లెక్కే లేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను తీసుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఉన్నా, ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో నాకు విజయం లభించింది. అది శృతి హాసన్ గెలుపుకు ఎంతో సహాయపడిందని ఆమె చెప్పుకొచ్చారు.

అదృష్టవంతురాలు, దురదృష్టవంతురాలు అనే రెండు పదాలను శృతి హాసన్ ఇష్టపడరు. ఒక నటిగా తన పనిని ఆస్వాదించడమే తనకు ఇష్టమని ఆమె చెప్పారు. "నాకు సినిమాలు చాలా ఇష్టం. నేను వాటిని చేసుకుంటూ వెళ్తే చాలు" అని శృతి అన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కూలీ సినిమాలో రజనీకాంత్ సరసన, ట్రైన్, జన నాయగన్ లో దళపతి విజయ్ సరసన, అలాగే సలార్ 2లో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు చూస్తుంటే, ఆమె దశ పూర్తిగా తిరిగినట్టే అనిపిస్తుంది.

Tags:    

Similar News