Shivaraj Kumar: "నీకు మేమంతా ఉన్నాం" - రమ్యకు శివన్న మద్దతు

కన్నడ నటి రమ్య ఇటీవల సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్టు ఇప్పుడు చర్చకు దారి తీసింది. తనపై హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా, భయానకంగా మెసేజ్‌లు పెడుతున్నారని, తనపై అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2025-07-29 14:00 GMT

ఈ ఘటనపై రమ్య స్పందిస్తూ, నటి పవిత్ర గౌడపై రేణుకాస్వామి చేసిన వ్యాఖ్యలతో, ఇప్పుడు తనపై వస్తున్న వ్యాఖ్యల మధ్య పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. రమ్యకు తన పూర్తి మద్దతు తెలియజేస్తూ, ఆమెకు తక్కువచూపు, అసభ్య వ్యాఖ్యలు చేసే వారిని తీవ్రంగా ఖండించారు.

"ఇలాంటి వ్యవహారాలను సహించకూడదు. మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించాలి. అమ్మగా, తల్లిగా, చెల్లిగా చూడాలి. రమ్య సరిగా ఉన్న దారిలోనే నడుస్తోంది. నీకు మేమంతా అండగా ఉంటాం" అని శివరాజ్ కుమార్ తెలిపారు.

ఇటీవల రేణుకాస్వామి హత్య కేసుపై రమ్య చేసిన ఓ పోస్టు దర్శన్ అభిమానులను కించపరిచిందని భావించి, వారు ఆమెపై తీవ్రంగా స్పందించారు. "నీకు బదులు నిన్ను చంపితే బాగుండేది" అనేలా సందేశాలు పంపారు. ఆ సందేశాల స్క్రీన్‌షాట్‌లను ఆమె పోలీసులకు సమర్పించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News