Shanmukh - Deepthi: వాళ్ళిద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేస్తామంటున్న షణ్ముఖ్ తల్లి
శన్ముఖ్ జస్వంత్ - దీప్తి సునయన (ట్విట్టర్ ఫోటో)
Shanmukh Jaswanth: "వైవా" అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన శన్ముఖ్ జస్వంత్.. గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్న ఇటీవల విడుదలైన "ది సాఫ్ట్ వేర్ డెవలపర్", "సూర్య" వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాడు. ఒకవైపు వెబ్ సిరీస్ తోనే కాకుండా ప్రైవేటు సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు.
Shanmukh Jaswanth - Deepthi Sunaina
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శన్ముఖ్ జస్వంత్ ఇటీవల జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అడిగిన ప్రశ్నకి దీప్తి సునయన తన గర్ల్ ఫ్రెండ్ అంటూ తన మనసులోని మాట బుల్లితెర ప్రేక్షకుల ముందు చెప్పేశాడు. దీంతో శన్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ తరువాత దీప్తిని పెళ్లి చేసుకుంటాడనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శన్ముఖ్ జస్వంత్ తల్లి ఉమారాణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీప్తి సునయన, శన్ముఖ్ జస్వంత్ మధ్య ప్రేమ విషయంపై స్పందించింది.
Shannu - Deepthi Photos
శన్ను, దీప్తి ఇద్దరు కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్, సాంగ్స్ వీడియోల వలన వారు ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నట్లు ఉమారాణి తెలిపింది. అయితే దీప్తితో ప్రేమ విషయం తనతో శన్ను ఎప్పుడు చెప్పలేదని వారిది ఇంకా చిన్న వయస్సు అని చెప్తూనే ఒకవేళ వారిద్దరికీ ఒకరికొకరు ఇష్టం అయితే దీప్తి సునయన తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేస్తామని శన్ముఖ్ తల్లి ఉమారాణి చెప్పుకొచ్చింది. శన్ముఖ్ తల్లి కూడా దీప్తితో శన్ను పెళ్ళికి ఓకే అనడంతో దీప్తి - శన్ను అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Shanmukh Jaswanth - Deepthi Photos