Shaktimaan: శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి మరింత కొత్తగా
భారత టెలివిజన్ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సూపర్‌హీరో షో శక్తిమాన్, ఇప్పుడు మరో రూపంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Shaktimaan: శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి మరింత కొత్తగా
Shaktimaan: ఈ విషయాన్ని షేర్ చేస్తూ ముఖేశ్ ఖన్నా హర్షం వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడుతూ – "శక్తిమాన్ నా జీవితంలో ఓ భావోద్వేగం. ఇది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే ఒక శక్తివంతమైన పాఠం. ఇప్పుడు ఈ కథను పాకెట్ ఎఫ్ఎం వేదికగా ఆడియో సిరీస్ రూపంలో కొత్తగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టు, యువత వినడానికి ఇష్టపడే ఫార్మాట్‌లో, ఇయర్‌ఫోన్లలో శక్తిమాన్ శబ్దంగా జీవించనున్నాడు. ఇది కేవలం వినోదం కాదు, విలువలతో కూడిన ప్రయాణం" అన్నారు.
తొలి సూపర్ హీరో టీవీ సిరీస్
1997లో ప్రారంభమై 2005 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైన శక్తిమాన్, భారతదేశపు తొలి సూపర్‌హీరో టీవీ సిరీస్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే పాపులర్ సిరీస్‌ను నూతన కథలతో, నేటి తరానికి అర్థమయ్యేలా, ఆడియో రూపంలో మళ్లీ అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సిరీస్ పాకెట్ ఎఫ్‌ఎంలో అందుబాటులోకి రానుంది.