Shahrukh Khan: నా పిల్లలనూ అభిమానించండి.. ఫ్యాన్స్‌కు షారూఖ్ రిక్వెస్ట్
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల విజయాన్ని చూసి ఆనందిస్తారు. వారి కలలు నిజమయ్యేందుకు ప్రోత్సహిస్తారు.
నా పిల్లలనూ అభిమానించండి.. ఫ్యాన్స్‌కు షారూఖ్ రిక్వెస్ట్
Shahrukh Khan: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల విజయాన్ని చూసి ఆనందిస్తారు. వారి కలలు నిజమయ్యేందుకు ప్రోత్సహిస్తారు. అయితే చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఎంచుకున్న వృత్తిలోనే రాణిస్తుంటారు. అలా తల్లిదండ్రులను చూసి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ అయిన వారూ ఉన్నారు. అయితే వారిలో కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు అంతగా రాణించలేదు.
సినీ ఇండస్ట్రీలోకి చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కొందరు ఫ్లాప్ అవుతుంటే.. మరికొందరు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సక్సెస్‌తో దూసుకుపోతుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోని కలిసిరాక కరుమరుగైన వారూ ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో ఓ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో షారూఖ్ కుమార్తె సుహానా ప్రధాన పాత్రలో నటించారు. నెట్‌ఫ్లిక్స్ లో ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. తనపై కురిపించే ప్రేమాభిమానాల్లో సగమైనా తన పిల్లలపై చూపించాలని కోరారు.
తన కుమారుడు ఆర్యన్ దర్శకత్వంలో తొలి అడుగు వేస్తున్నాడని.. నటిగా తన కుమార్తె కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలిపారు. వారిని మీరందరూ ఆదరించాలని.. తనకు ఇచ్చిన అభిమానంలో 50 శాతమైనా వారికి అందించాలని కోరారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. కొన్ని ఎపిసోడ్స్ చూశానని.. ఫన్నీగా ఉన్నాయని చెప్పారు. తనకు ఇలాంటి హాస్యభరిత సన్నివేశాలంటే ఇష్టమన్నారు. తాను జోక్స్ వేస్తే కొందరు ప్రేక్షకులు కోపంగా మాట్లాడానని అనుకుంటున్నారని అందుకే జోక్స్ వేయడం మానేశానని చెప్పారు. తన వారసత్వాన్ని తన కుమారుడు ఆర్యన్‌కు ఇచ్చి తనను గర్వపడేలా చేయమని చెప్పానన్నారు.
ఇక షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా విషయానికొస్తే.. ది ఆర్చీస్‌లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినీ నేపథ్యం లేని వ్యక్తి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న ఒడుదుడుకులను ఈ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో చూపించనున్నారు.