Shah Rukh Khan Health: షారుక్ ఖాన్‌కు అస్వస్థత.. కింగ్ షూటింగ్‌లో డూప్ లేకుండా స్టంట్ చేస్తుంటే
Shah Rukh Khan Health: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన కింగ్ షూటింగ్ సినిమాలో ఉన్నప్పుడు ఒక్కసారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.
Shah Rukh Khan Health: షారుక్ ఖాన్‌కు అస్వస్థత.. కింగ్ షూటింగ్‌లో డూప్ లేకుండా స్టంట్ చేస్తుంటే
Shah Rukh Khan Health: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన కింగ్ షూటింగ్ సినిమాలో ఉన్నప్పుడు ఒక్కసారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అయితే అత్వవసర చికిత్స్ నిమిత్తం షారుక్ అతని టీం అమెరికా వెళ్లినట్లు సమాచారం.
షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న కింగ్ సినిమా షూటింగ్ కొంతకాలంగా జరుగుతోంది. అయితే శనివారం ఈ సినిమా కోసం ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా షారుక్ ఖానే స్టంట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో కింగ్ సినిమాను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన షారుక్ ఖాన్ ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి కింగ్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ కథా నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకి సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుహానా ఖాన్ తల్లి పాత్రలో సీనియర్ నటి రాణి ముఖర్జీ నటిస్తుంది. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. అయితే తాజాగా కొన్ని సన్నివేశాల్లో డూప్ అవసరం ఉన్నా షారుక్ ఖాన్ మాత్రం డూప్ హెల్ప్ తీసుకోకుండా స్వయంగా చేస్తున్నారు. అయితే ఇలా ఒక షూటింగ్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. అయితే వెంటనే తన టీం సభ్యులు ఆయన్ని మెరుగైన చికిత్స్ కోసం అమెరికాకు తీసుకెళ్లినట్లు సమచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.