Eshwar: సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ కన్నుమూత

Eshwar: చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఈశ్వర్

Update: 2021-09-21 05:13 GMT

ఈశ్వర్ పబ్లిసిటీ డిసైనర్ (ఫైల్ ఇమేజ్)

Eshwar: సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ తుదిశ్వాస విడిచారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఈశ్వర్‌ పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన..

బాపు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2వేల 6వందలకు పైగా చిత్రాలకు ఈశ్వర్ పనిచేశారు.

విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా వర్క్ చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం.

ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఈశ్వర్‌ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఏపీ ప్రభుత్వం సత్కరించింది. ఈశ్వర్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Full View


Tags:    

Similar News