Actress Kavitha: కరోనాతో నటి కవిత కుమారుడు మృతి
Actress Kavitha: సీనియర్ నటి కవిత తనయుడు సంజయ్ కరోనాతో మృత్యువాతపడ్డాడు.
Senior Actress Kavitha:(File Image)
Actress Kavitha: టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె తనయుడు సంజయ్ రూప్ కొవిడ్‌తో మృతి చెందాడు. ఇటీవల కరోనా వైరస్ బారినపడి సంజయ్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే, పరిస్థితి విషమించంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు.
ఆమె భర్త దశరథరాజు కూడా కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన కవిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించింది. కవిత 11 ఏళ్ల వయసులో వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సంజయ్ రూప్ మృతికి పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.