Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం మరో రికార్డ్‌.. ట్రిపులార్‌ తర్వాత ఇదే సినిమా

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం మరో రికార్డ్‌.. ట్రిపులార్‌ తర్వాత ఇదే సినిమా. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ మూవీ, రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం, 3వ స్థానంలో ‘అల వైకుంఠపురం’, 4వ స్థానంలో ‘బాహుబలి 2’, 5వ స్థానంలో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఉన్నాయి.

Update: 2025-01-20 12:44 GMT

సంక్రాంతికి వస్తున్నాం మరో రికార్డ్‌.. ట్రిపులార్‌ తర్వాత ఇదే 

Sankranthiki Vasthunam collectios: వెంకటేష్‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. హౌజ్ ఫుల్‌ షోలతో సినిమా విజయవంతమైంది.

కాగా ఈ సినిమా ఐదో రోజు రూ. 12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో చేరిందీ మూవీ. ఈ లిస్ట్‌లో సంక్రాంతికి వస్తున్నాం రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో రూ. 13.63 కోట్లతో ట్రిపులార్‌ ఉండగా. సంక్రాంతికి వస్తున్నాం రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో ‘అల వైకుంఠపురం’ (రూ.11.43 కోట్లు), 4వ స్థానంలో ‘బాహుబలి 2’ (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో రూ.10.86 కోట్లతో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ సంక్రాంతికి వస్తున్నాం మంచి వసూళ్లను రాబడుతోంది. వెంకటేష్‌ కెరీర్‌లోని ఆల్‌టైమ్‌ వసూళ్లను రాబట్టిందీ మూవీ. ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ చిత్రం 7 లక్షల డాలర్లు రాబట్టినట్లు టీమ్ వెల్లడించింది.‌ తాజాగా అక్కడ రెండు మిలియన్‌ డాలర్లు సాధించినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వెంకీ కెరీర్‌లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌లుగా నటించిన విషయం తెలిసిందే. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో దర్శకుడు అనిల్‌తో పాటు చిత్ర యూనిట్‌ విజయవంతమైంది. దీంతో సినిమాకు ఫ్యామిలీస్‌లో మంచి ఆదరణ లభించింది. పోటీగా మరో సినిమా లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News