Sankranthi War : సంక్రాంతి వార్ లో నితిన్, రామ్?

Sankranthi War : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉంది. కరోనా వలన సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం అయితే చూసిందని

Update: 2020-08-25 08:15 GMT

nithin and ram

Sankranthi War : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉంది. కరోనా వలన సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం అయితే చూసిందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే షూటింగ్ లకి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అయితే ధియేటర్లుకి ఇంకా పూర్తి స్థాయిలో అనుమతి రాకపోవడంతో సినిమాలను ఓటీటీ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి.. అయితే మరికొందరు హీరోలు మాత్రం తమ సినిమాని మాత్రం కచ్చితంగా ధియేటర్లలోనే రిలీజ్ చేస్తామ్మని అంటున్నారు..

అందులో హీరో రామ్ ఒకరు.. ప్రస్తుతం రామ్ 'రెడ్' అనే సినిమాలో నటిస్తున్నాడు.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ సినిమాని ఓటీటీలో కాకూడ కచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని హీరో రామ్ ఇప్పటికే స్పష్టం చేసాడు. దీంతో రామ్ 'రెడ్' సంక్రాంతి బరిలో నిలవనుందని తెలుస్తోంది. ఇక రామ్ కు పోటీగా యంగ్ హీరో నితిన్ రంగ్ దే చిత్రం పోటిగా నిలవనుందని తెలుస్తోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు కానీ అది కుదరకపోవడంతో సంక్రాంతిని టార్గెట్ చేసారని తెలుస్తుంది. సంక్రాంతి అంటేనే పెద్ద హీరోల సినిమాలు మరి.. పెద్ద హీరోల సినిమాలలో సంక్రాంతికి వచ్చే సినిమాలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రెడీగా ఉంది. ఇక రాజమౌళి RRR ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కానీ అది కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Tags:    

Similar News