Sandeep Reddy Vanga: స్పిరిట్‌పై తాజా అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా
ఎప్పటి నుంచో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌పై చివరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు.
Sandeep Reddy Vanga: స్పిరిట్‌పై తాజా అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా
ఎప్పటి నుంచో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌పై చివరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్ల కోసం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందీప్, అక్కడే ఈ విషయం వెల్లడించాడు.
విజయ్ స్పిరిట్ గురించి ప్రశ్నించగా, సందీప్ ఎటువంటి సందేహం లేకుండా "సెప్టెంబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది" అని స్పష్టంగా చెప్పాడు. లీక్ ఏదైనా ఉందా అని అడిగితే, "లీక్ ఏమీ లేదు, షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం అంతే" అని సమాధానమిచ్చాడు. అంతేకాదు, "ఒక్కసారి మొదలుపెట్టాక నాన్‌స్టాప్‌గా పూర్తి చేస్తాం" అని క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. హీరోయిన్‌గా మొదట భావించిన దీపికా పడుకొణె బదులుగా తృప్తిను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇది ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.