Samantha: మ్యాగజైన్‌ కవర్‌పేజీపై మెరిసిన స్టార్‌

నటి సమంత రుత్‌ ప్రభు (Samantha Ruth Prabhu) మరో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) తాజా ఎడిషన్‌ కవర్‌పేజీపై ఆమె ఫొటోను ప్రదర్శించింది.

Update: 2025-08-19 12:31 GMT

Samantha: మ్యాగజైన్‌ కవర్‌పేజీపై మెరిసిన స్టార్‌

నటి సమంత రుత్‌ ప్రభు (Samantha Ruth Prabhu) మరో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) తాజా ఎడిషన్‌ కవర్‌పేజీపై ఆమె ఫొటోను ప్రదర్శించింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ స్టిల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో కలిసి ఫొటోగ్రఫీ డేను జరుపుకున్నట్టు గ్రాజియా ప్రకటించింది.

సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణంలో పోషించిన గుర్తుండిపోయే పాత్రలను ప్రశంసిస్తూ, తనదైన ముద్ర వేసిందని గ్రాజియా పేర్కొంది. 22 క్యారెట్ల బంగారు ఉంగరం, గాజులతో సమంత కవర్‌పేజీపై మరింత మెరిసిపోయారు.

ఈ ఏడాది ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’లో అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను కూడా సమంత ఇప్పటికే ప్రకటించారు. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న‘పెద్ది’లో ఆమె ప్రత్యేక గీతంలో నటించే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఇక లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఖైదీ 2’లో కూడా సమంతకు కీలక పాత్ర దక్కే అవకాశం ఉందని కోలీవుడ్‌ టాక్‌ వినిపిస్తోంది.

Tags:    

Similar News