Samantha Ruth Prabhu: సమంత పోస్ట్ వైరల్.. ఇంతకీ అందులో ఏముందంటే..?

Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు నటి సమంత. ఇన్‌స్టా వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు.

Update: 2024-12-09 09:48 GMT

Samantha Ruth Prabhu: సమంత పోస్ట్ వైరల్.. ఇంతకీ అందులో ఏముందంటే..?

Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు నటి సమంత. ఇన్‌స్టా వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ప్రేమను ఉద్దేశించి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన పెంపుడు శునకం సాషాతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు సమంత. సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు అనే క్యాప్షన్ జత చేశారు. సమంత పెట్టిన పోస్టుపై నెటిజన్ల రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం జరిగింది. నాగ చైతన్య ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు కౌంటర్‌గానే సమంత ఈ పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నాగచైతన్య, శోభిత, సమంత. శోభిత, నాగ చైతన్య ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి వారి ఫొటోలు పేర్లతో పాటు సమంత పేరు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీరి ఫొటోలను పక్కపక్కన పెడుతూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతకొంతకాలంగా సమంత గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం కొద్దిరోజులకే మయోసైటిస్ బారిన పడింది. దాని నుంచి కోలుకునేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్న సమయంలో తన తండ్రి జోసెఫ్ ప్రభు హఠాత్తుగా మరణించారు. మరోవైపు మాజీ భర్త నాగచైతన్య మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో సమంతకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నెటిజన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.



Tags:    

Similar News