Samantha: ఒంటరి తనం భయంకరంగా ఉంటుంది.. అయినా మూడు రోజులు వాటికి దూరంగా ఉన్నా.. సమంత
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఒంటరి తనం భయంకరంగా ఉంటుంది.. అయినా మూడు రోజులు వాటికి దూరంగా ఉన్నా.. సమంత
Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మూడు రోజుల పాటు ఫోన్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపారు సమంత. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సమంత మనశాంతి, ఆరోగ్యం వంటి వాటిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఫోన్ లేకుండా, ఇన్ స్టాలు, ట్విట్టర్ వాడకుండా, కమ్యూనికేషన్ సిస్టం లేకుండా ఉండడం అనేది దాదాపు అసాధ్యమే. కానీ సమంత ఓ మూడు రోజులు వీటన్నింటికి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
ఫోన్, కమ్యూనికేషన్ లేకుండా ఉండడం కష్టం.. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టం.. అయిన కూడా ఎంతో గొప్పగా అనిపించిందన్నారు సమంత. ఇది తాను అందరికీ రికమండ్ చేస్తానని.. ఇలా ఓ మూడు రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని.. ఇది ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని సమంత సలహా ఇచ్చారు. ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. మరి సమంత సలహాను ఎవరైనా పాటిస్తారా అనేది చూడాలి.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు తెరపై మహిళా ప్రాధాన్య కథలతో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో రాణిస్తున్నారు. సమంత, వరున్ ధావన్ కలిసి నటించిన సిటాడెట్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌కు ఐకానిక్ గోల్డ్ అవార్డ్‌తో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డునూ గెలుచుకుంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యానని.. మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశానంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.