Samantha on Ye Maaya Chesave Re-release: నాగచైతన్యతో కలిసి ప్రమోషన్లపై సమంత క్లారిటీ

సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’ రీ రిలీజ్‌ ప్రమోషన్లలో పాల్గొంటారనే వార్తలపై సమంత స్పష్టత. ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమంత పేర్కొన్నారు.

Update: 2025-06-18 10:19 GMT

Samantha on Ye Maaya Chesave Re-release: నాగచైతన్యతో కలిసి ప్రమోషన్లపై సమంత క్లారిటీ

నటులు నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’ (Ye Maaya Chesave) సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రం జూలై 18, 2025న రీ రిలీజ్‌ కాబోతుండటంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. అయితే రీ రిలీజ్‌ సందర్భంగా సమంత, చైతన్య కలిసి ప్రమోషన్లలో పాల్గొంటారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సమంత స్పందిస్తూ, తాను ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రచారాలు నిరాధారమని ఆమె ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌కి తెలిపారు.

"ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నా" - సమంత

‘‘చిత్రబృందం తరఫున ప్రమోషన్లలో నేను పాల్గొనట్లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలకు నేను దూరంగా ఉన్నా. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ప్రేక్షకులు మనసులో కలిగించుకున్న ఊహలు ఇలా పుకార్లుగా మారుతున్నాయి. ఎవరి జీవితం కూడా ప్రజాదృష్టికోణంపై ఆధారపడి ఉండదు,’’ అని సమంత స్పష్టం చేశారు.

గౌతమ్ మీనన్‌తో పని చేసిన మొదటి అనుభవం

తదుపరి ఆమె తన కెరీర్ ప్రారంభ దశను గుర్తు చేసుకుంటూ, ‘‘మాస్కోవిన్ కావేరి’’ సినిమాలో షూటింగ్ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అయితే తనకు ‘‘ఏ మాయ చేసావె’’ చిత్రం గురించి స్పష్టమైన గుర్తులున్నాయని తెలిపారు.

‘‘జెస్సీ, కార్తీక్‌లపై షూట్ చేసిన ఇంటి గేట్ సీన్‌ నా తొలి షాట్‌. కెరీర్ ఆరంభంలోనే దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు.

సమంత నిర్మాతగా కూడా రాణిస్తోంది

ప్రస్తుతం సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తళుక్కుమంటోంది. ఆమె నిర్మించిన మొదటి ఫీచర్ ఫిల్మ్‌ ‘శుభం’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News