Samantha: 15 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సమంత
సమంత సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. 2010లో విడుదలైన ఏ మాయ చేశావే సినిమా ద్వారా సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు సమంత.
15 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సమంత
Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీకి లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ బయటపెట్టి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సమంత సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. 2010లో విడుదలైన ఏ మాయ చేశావే సినిమా ద్వారా సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు సమంత. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్, మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో కూడా వరుస సినిమాలు చేసింది.
సమంత, నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమాలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమాలో ఆమె మాటలు, అందానికి యూత్ ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ బృందావనంలో నటించారు. ఈ మూవీలో గ్లామర్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడులో మోడల్ ప్రశాంతిగా మెప్పించారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటారు.
నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో అద్బుతంగా మెప్పించారు. ఈగ సాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా సమంత నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేదిలో మరదలు శశిగా తనదైన నటనతో మెప్పించారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమాలో ప్రియగా నటించారు. ఆ తర్వాత సమంత అక్కినేని వారి కోడలు అయింది. ఆ తర్వాత మజిలీ, ఓ బేబి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శాకుంతలం, యశోద, ఖుషీ వంటి సినిమాల్లో నటించారు.
చివరిగా సమంత తెలుగులో ఖుషి, తమిళంలో కాతువాక్కుల రెండు కాదల్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల తర్వాత సమంత జీవితంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. విడాకులు, మయోసైటిస్ వ్యాధి, తండ్రి చనిపోవడం ఇలా సమంతను అనేక సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్న సమంత.. మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా నిర్మాతగా కూడా పరిచయం కానుంది. ఈ క్రమంలోనే సమంత సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి కావడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ 15 ఏళ్ల జీవితంతో ఎన్నో కష్టనష్టాలు చూసింది సమంత. స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఏడేళ్లు ప్రేమించిన నాగచైతన్యను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ఆ తర్వాత మయో సైటిస్ వ్యాధి రావడంతో మరోసారి ఆమెకు కష్టాలు తప్పలేదు. అయినా ఎంతో ధైర్యంగా ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుని పట్టుదలతో ముందుకు సాగుతూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సమంత.