Cinema: ఈ సినిమా కలెక్షన్స్ 200 కోట్లు.. కానీ అట్టర్ ప్లాప్.. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు?
Cinema: ఈ మధ్య ఎందుకు..ఎలా సినిమాలు హిట్ అవుతున్నాయో.. ఫట్ అవుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు.
Cinema: ఈ సినిమా కలెక్షన్స్ 200 కోట్లు.. కానీ అట్టర్ ప్లాప్.. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు?
Cinema: ఈ మధ్య ఎందుకు..ఎలా సినిమాలు హిట్ అవుతున్నాయో.. ఫట్ అవుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. భారీ బడ్జెట్‌తో తీసి, ఎంతో హోప్ప్ పెట్టుకున్న సినిమా అయినా అట్టర్ ప్లాప్ అవుతుంది. అసలు ఎటువంటి ప్రచారాలు లేని, అందులో కొత్త హీరోహీరోయిన్లు ఉన్నా ఆ సినిమా హిట్ అయిపోతుంది. తాజాగా ఒక సినిమా కథ కూడా ఇంతే అయింది. దీని కలెక్షన్ మాత్రం 200 కోట్లు. కానీ సినిమా చూస్తే అట్టర్ ప్లాప్. అసలు ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.
సాధారణంగా సినీరంగంలో ఎవరైనా పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయిందంటే.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. పెద్ద హీరోల సినిమాలంటే అంత క్రేజ్ మరి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో కూడా అంతే. అతగాడికి పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా కూడా అంతే దాదాపు రూ.200 కలెక్షన్స్ రాబట్టింది. కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు బీటౌన్ స్టార్ సల్మాన్ ఖాన్.
సల్మాన్ చేసిన సినిమాలన్నీ హిట్టే. అందుకే అతనొక క్రేజ్. కానీ అతని జీవితంలో ఈ సినిమా ఒక్కటే అట్టర్ ప్లాప్. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు అర్ధం అయిందా? అదే ట్యూబ్ లైట్. ఈ సినిమా 2017లో విడుదలైంది. దాదాపు 2 గంటల 50 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. భారతదేశంలో ఈ సినిమా రూ.119 కోట్లు వసూలు ఏస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 212 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ వావ్ అనిపించినా.. ఈ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్. సినిమా మొదట్లోనే వసూళ్లు అయ్యాయి. కానీ ఆ తర్వాత నిర్మాతలకు లాభాలు రాలేదు. ఎంతో అంచనాలతో నిర్మించిన ఈ సినిమా హిట్ కాకపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. ఇక మన సల్మాన్ ఖాన్ సినిమాల కెరీర్‌లో ఇదొక మచ్చగా మిగిలిపోయింది.