War 2 : వార్ 2లో యానిమల్ విలన్.. సల్మాన్, షారూఖ్ కూడా ఉన్నారా ?
దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
War 2 : వార్ 2లో యానిమల్ విలన్.. సల్మాన్, షారూఖ్ కూడా ఉన్నారా ?
War 2 : దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరిలో ఒకరు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.. కానీ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ క్రమంలో వార్ 2 టీమ్‌లోకి మరో స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఆయనే బాబీ డియోల్.
యానిమల్ సినిమాలో విలన్‌గా నటించి బాబీ డియోల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయనకు విలన్ పాత్రల కోసం చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు వార్ 2లో కూడా బాబీ డియోల్ మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా ఉండటంతో బాబీ డియోల్‌ను పూర్తి స్థాయి యాక్షన్ అవతార్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు వస్తున్న ఈ సినిమాకు మంచి టాక్ వస్తే, వారాంతంలో కలెక్షన్లు భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదల కానుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఉండవచ్చని కొందరి అంచనా. అది నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన జనాబ్-ఏ-ఆలీ పాట ప్రోమో వైరల్‌గా మారింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగం కాబట్టి, ఈ చిత్రంలో టైగర్ (సల్మాన్ ఖాన్), పఠాన్ (షారుఖ్ ఖాన్) వంటి పాత్రలు అతిథి పాత్రల్లో కనిపించవచ్చని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఈ అన్ని ప్రశ్నలకు ఆగస్టు 14న సమాధానం లభిస్తుంది.