Saiyaara Shatters Box Office: పదింతల లాభాలిస్తున్న సినిమా ఇదొక్కటే..
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యం కాదు. పెట్టుబడి రాబడిస్తే చాలు, నిర్మాతలకు అదే గెలుపు. కానీ 'సైయారా' చిత్రం మాత్రం అందరి అంచనాలను మించి, రూపాయికి పది రూపాయల లాభం ఇస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం కురిపిస్తోంది.
Saiyaara Shatters Box Office: పదింతల లాభాలిస్తున్న సినిమా ఇదొక్కటే..
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యం కాదు. పెట్టుబడి రాబడిస్తే చాలు, నిర్మాతలకు అదే గెలుపు. కానీ 'సైయారా' చిత్రం మాత్రం అందరి అంచనాలను మించి, రూపాయికి పది రూపాయల లాభం ఇస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రెండు వారాలకే ఫైనల్ రన్‌ని దాటేసింది. చావా 91 కోట్లు వసూలు చేస్తే, సైయారా ఇప్పటికే 94 కోట్లను దాటేసి వంద కోట్ల మార్క్‌కు దూసుకుపోతోంది. ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చెప్పడం ఎవరి తరానికి రావడం లేదు, ఎందుకంటే విజయం పరంగా ఇది ఓ రికార్డు బ్రేకర్‌గా నిలిచింది.
ఇక సైయారా బడ్జెట్ కేవలం 30 కోట్లే అయినా ఇప్పటివరకు 400 కోట్ల గ్రాస్‌ను దాటి, ఈ వీకెండ్‌లో అర సహస్రాన్ని అందుకోబోతోంది. ఈ సినిమాకు హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సామ్రాజ్య, సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 లాంటి కొత్త విడుదలలు పోటీగా ఉన్నా, 'సైయారా' విజయ రథాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. నిర్మాత భాగస్వామిగా ఉన్న యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత స్ట్రాటజికల్‌గా ప్లాన్ చేసిన మార్కెటింగ్ దీర్ఘకాల విజయం వెనుక ప్రధాన కారణమని చెప్పవచ్చు. రిలీజ్ తొలి రోజునే భారీ ఆఫర్లతో స్టార్ట్ ఇచ్చిన తర్వాత, కథ-నటీనటుల నైపుణ్యం ప్రేక్షకులను థియేటర్ల వైపు లాగేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం థర్డ్ వీక్‌లోనూ జిల్లా కేంద్రాలు, నగరాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం నిజంగా ఆశ్చర్యమే. ఇది షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సాధించలేని స్థాయిలో నిలబడిన విజయంగా చెప్పొచ్చు. కొత్త జంటతో వచ్చిన ఓ లవ్‌స్టోరీ ఇంత పెద్ద హిట్ కావడం ఆశ్చర్యం కలిగించకమానదు. హీరో ఆహాన్ పాండే ఒక్కసారిగా ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిన స్టార్‌గా నిలిచాడు. దర్శకుడు మోహిత్ సూరికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. హీరోయిన్ అనీత్ పడా కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది.
ఇంత విజయవంతంగా దూసుకుపోతున్న 'సైయారా' స్పీడ్‌ని తట్టుకోగల సినిమాలు 'వార్ 2', 'కూలీ' అవుతాయేమో చూడాలి.