Sai Pallavi: రామాయణ లో సాయి పల్లవిని సీతగా తీసుకుంది అందుకేనట!

భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు పెంచుతున్న ‘రామాయణ’ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

Update: 2025-07-18 14:41 GMT

Sai Pallavi: రామాయణ లో సాయి పల్లవిని సీతగా తీసుకుంది అందుకేనట!

భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు పెంచుతున్న ‘రామాయణ’ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఈ కీలక పాత్రలకు ఎంపిక చేసిన కారణాలను వెల్లడించారు. రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన అద్భుతమైన నటన మరియు ప్రశాంతమైన వ్యక్తిత్వం అని తెలిపారు. సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడానికి కారణం ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం, అందం కోసం సర్జరీలు చేయించుకోకపోవడం అని పేర్కొన్నారు. సీత పాత్రకు కావలసిన సహజ అందం సాయి పల్లవిలో ఉందని, అదే కారణంగా ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ రామాయణపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.

Tags:    

Similar News