నెక్స్ట్ సినిమాల పైనే హోప్స్ పెట్టుకున్న హిట్ హీరోయిన్

Ruhani Sharma: హిట్ హీరోయిన్లు ఇప్పటికైనా సెటిల్ అవుతారా?

Update: 2023-03-22 15:00 GMT

నెక్స్ట్ సినిమాల పైనే హోప్స్ పెట్టుకున్న హిట్ హీరోయిన్ 

Ruhani Sharma: కొన్ని కొన్ని సార్లు సినిమాలు సూపర్ హిట్ అయితేనే హీరోయిన్ లకు బోలెడు ఆఫర్లు వచ్చి పడొచ్చు. కానీ మరికొన్నిసార్లు సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ ఆ సినిమాలో హీరోయిన్ లకి ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాకపోవచ్చు. "హిట్" వంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైస్ లో నటించిన ఇద్దరు హీరోయిన్లు కూడా రెండవ కొవ్వకే చెందుతారు. సుశాంత్ హీరోగా "చి ల సౌ" సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్ గా పరిచయమైంది.

మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న రుహానీ శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ సరసన హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ సినిమా సక్సెస్ రుహానీ శర్మ కి ఆఫర్లు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత చాలా కాలం రుహానీ శర్మ మళ్ళీ వెండి తెర పై కనిపించలేదు. తాజాగా ఇప్పుడు రుహానీ శర్మ సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న "సైంధవ్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాకి కూడా శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవరిస్తున్నారు.

మరొకవైపు అడవి శేష్ సరసన హీరోయిన్ గా "హిట్ 2" సినిమాలో మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత మీనాక్షి చౌదరి "ఖిలాడి", ,ఇచట వాహనములు నిలపరాదు" వంటి సినిమాలలో నటించింది కానీ అవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇప్పటికీ ఆమెకు పెద్ద ఆఫర్లు ఏమీ రావటం లేదు . తాజాగా ఈ మధ్యనే విశ్వక్ సేన్ సినిమాలో ఈమెకి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. మరి ఈ సినిమాలతో హిట్ హీరోయిన్లు ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News