Tollywood: ఈ టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కోహ్లి మరదలు అని తెలుసా.?
Tollywood: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఓ హీరోయిన్ హాట్ ఫోటోలు ఊపేస్తున్నాయి. ఆమె ఎవరో కాదు... టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బంధువే. కోహ్లికి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది.
Tollywood: ఈ టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కోహ్లి మరదలు అని తెలుసా.?
Tollywood: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఓ హీరోయిన్ హాట్ ఫోటోలు ఊపేస్తున్నాయి. ఆమె ఎవరో కాదు... టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బంధువే. కోహ్లికి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది. కోహ్లికీ టాలీవుడ్ హీరోయిన్ మరదలు కావడం ఏంటని ఆలోచిస్తున్నారా.?
అవును టాలీవుడ్ హీరోయిన్ రుహాణి శర్మ కోహ్లికి మరదలు అవుతుంది. అనుష్క శర్మకు రుహాణి చెల్లె అవుతుంది.ఈ విషయాన్ని రుహాణి స్వయంగా తెలిపింది. సైంధవ్ సినిమా ప్రమోషన్ సమయంలో రుహాణి విషయాన్ని వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఈ వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా రుహాణి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమిళ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన రుహాణి శర్మ, తెలుగు తెరకు “చి..ల..సౌ” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి సినిమాల్లో నటించింది.
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన “సైంధవ్” లో కూడా ఆమె నటించింది. కానీ మంచి నటన ఉన్నా, ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ల స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది. తాజాగా రుహాణి షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోషూట్‌లో ఆమె గ్లామర్ మోతాదు పెంచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అవకాశాల కోసమేనా.?
ఇదలా ఉంటే సినిమా అవకాశాల కోసమే రుహాణి ఇలా గ్లామర్ డోస్ పెంచినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాను గ్లామర్ పాత్రలో నటించడానికి సిద్ధమేనన్న మెసేజ్ ఇవ్వడానికే ఇలాంటి ఫొటో షూట్స్ అంటున్నారు మరికొందరు.