RRR: తెలుగులో కంటే "ఆర్ ఆర్ ఆర్" హిందీ వెర్షన్ ఐదు నిమిషాలు ఎక్కువ?

RRR: "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే...

Update: 2022-03-23 09:06 GMT

RRR: తెలుగులో కంటే "ఆర్ ఆర్ ఆర్" హిందీ వెర్షన్ ఐదు నిమిషాలు ఎక్కువ?

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైలర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనే కాక మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే తాజాగా సినిమా రన్ టైం కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ 3 గంటల రెండు నిమిషాలు అనే సంగతి ఇప్పటికే తెలిసిందే. అంటే హిందీ వెర్షన్ మాత్రం తెలుగు వర్షన్ కంటే ఐదు నిమిషాలు ఎక్కువగా ఉందట. అంటే మూడు గంటల 7 నిమిషాల అని తెలుస్తోంది.

తెలుగులో లేకుండా మరి హిందీలో ఆ ఎక్స్ట్రా ఐదు నిమిషాలు ఏ ఏ సన్నివేశాలు ఉన్నాయని అభిమానులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలయ్యే దాకా దీని గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. ఇక మరోవైపు అవసరమైతే హిందీ వర్షన్ కోసం మరికొన్ని ఎడిషనల్ సన్నివేశాలని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News