RRR Movie Pre Release: RRR ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే షాకవ్వాల్సిందే!

RRR Movie Pre Release: రాజమౌళి నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ ‌(రౌద్రం రణం రుధిరం).

Update: 2021-04-02 12:10 GMT

ఆర్ఆర్ఆర్ సినిమా (ఫొటో ట్విట్టర్)

RRR Movie Pre Release: రాజమౌళి నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ ‌(రౌద్రం రణం రుధిరం). కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. దీని థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.570 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల పేరిట అప్పుడే రూ.300 కోట్లు నిర్మాతలకు అందాయంట. బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ 

తెలుగు రాష్ట్రాల్లో రూ. 240 కోట్ల బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో రూ.48 కోట్లు, కర్ణాటకలో రూ.45 కోట్లు, కేరళలో రూ.15 కోట్లు, హిందీలోనూ రూ.140 కోట్లకు బిజినెస్‌ జరిగిందట. అలాగే ఓవర్సీస్‌లో రూ.70 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట. అలాగే మ్యూజిక్‌ రైట్స్‌కు మరో రూ.20 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది‌. మొత్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దాదాపు రూ.900 కోట్లుగా తేలిందంట.

గతంలో రాజమౌళి నుంచి వచ్చిన 'బాహుబలి 2'కు రూ.500 కోట్లకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ రికార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తిరగరాసింది. 'బాహుబలి 2' కంటే దాదాపు రెట్టింపు ధరకు హక్కులు అమ్ముడుపోవడం ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమాకు ఇంతలా భారీ మొత్తంలో బిజినెస్‌ జరగకపోవడం విశేషం.

ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ 

ఈ క్రెడిట్ అంతా దర్శక ధీరుడు రాజమౌళి కే దక్కుతుందనండంలో ఆశ్చర్యం లేదు. ఆయన సినిమా అంటేనే బ్లాక్ బస్టర్ అని భావించిన డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మొత్తం బడ్జెట్‌ సుమారు రూ.400 కోట్లు అయిందని సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో నిర్మాతలు భారీగా లాభపడినట్లేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌ అక్టోబర్‌ 13న దసరా పండగకు సోలోగా రిలీజ్‌ అవుతోంది.

Tags:    

Similar News