ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. రాజమౌళి ప్లానే ప్లాన్..

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాను బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీని సిద్దం చేస్తున్నారని మూవీ టీమ్ ప్రకటించింది.

Update: 2024-12-09 15:41 GMT

ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. రాజమౌళి ప్లానే ప్లాన్..

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాను బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీని సిద్దం చేస్తున్నారని మూవీ టీమ్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ కీర్తిని చూసింది. ఇప్పుడు కథను చూడండి అంటూ ఈ ప్రాజెక్టు గురించి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనుక ఏం జరిగింది. దీన్ని ఎలా రూపొందించారో ఇందులో చూపనున్నారు. అయితే దీన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ పై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయింది. అయితే దీన్ని థియేటర్‌లో విడుదల చేస్తారా..? ఓటీటీలో విడుదల చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అయినా కూడా ఇప్పటికీ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారంటే చాలావరకు అది రాజమౌళి క్రెడిట్ అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ బయటకు రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు. ఈ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు టాక్.

Tags:    

Similar News