Ritika Singh: మార్షల్ ఆర్ట్స్ క్వీన్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మెరిసిపోతున్న స్టార్

సినిమా ఇండస్ట్రీ అంటే కలల ప్రపంచం. ఎవరెవరో అనేక ఆశలతో ఈ రంగంలో అడుగుపెడుతుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి, స్ఫూర్తిగా నిలిచిన వాళ్లలో రితిక సింగ్ ఒకరు.

Update: 2025-08-19 12:46 GMT

Ritika Singh: మార్షల్ ఆర్ట్స్ క్వీన్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మెరిసిపోతున్న స్టార్

సినిమా ఇండస్ట్రీ అంటే కలల ప్రపంచం. ఎవరెవరో అనేక ఆశలతో ఈ రంగంలో అడుగుపెడుతుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి, స్ఫూర్తిగా నిలిచిన వాళ్లలో రితిక సింగ్ ఒకరు.

చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువతో పెరిగిన రితికా, మార్షల్ ఆర్ట్స్‌లోనూ, బాక్సింగ్‌లోనూ ప్రతిభ చాటుకున్నారు. ఆమె 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా, సూపర్ ఫైట్ లీగ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. క్రీడల్లో రాణించిన రితికా, తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఇరుతి చూడ్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అదే సినిమా తెలుగు రీమేక్ గురులో విక్టరీ వెంకటేష్ సరసన నటించి గుర్తింపు పొందారు.

తొలి సినిమాతోనే విశేషంగా ఆకట్టుకున్న రితికా, తర్వాత రజనీకాంత్, రాఘవ లారెన్స్, మాధవన్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, విజయ్ ఆంటోని వంటి పలువురు స్టార్‌లతో కలిసి నటించారు. కొద్దిమంది సినిమాలు చేసినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

తన నటనతో పాటు గ్లామరస్ లుక్‌లతోనూ రితిక సింగ్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటూ, సినీ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News