Rithu Chowdary Comments On Hyper Aadi: నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా... దానికి కారణం ఆది అంటోన్న మరో మహిళా ఆర్టిస్ట్

Rithu Chowdary Comments On Hyper Aadi: సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ పొందిన టీవీ షో జబర్దస్త్. రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్న సమయంలో చాలా అతిపెద్ద హిట్ కామెడీ షో ఈ జబర్దస్త్ మాత్రమే.

Update: 2025-07-19 07:04 GMT

Rithu Chowdary Comments On Hyper Aadi: నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా... దానికి కారణం ఆది అంటోన్న మరో మహిళా ఆర్టిస్ట్

Rithu Chowdary Comments On Hyper Aadi: సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ పొందిన టీవీ షో జబర్దస్త్. రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్న సమయంలో చాలా అతిపెద్ద హిట్ కామెడీ షో ఈ జబర్దస్త్ మాత్రమే. అయితే ఆ తర్వాత రోజా, నాగబాబులు ఇద్దరూ వారి వారి పర్సనల్ కారణాలతో ఈ షోకి గుడ్ బై చెప్పేసారు. ఇక అప్పటినుంచి ఈ షో అంతతమాత్రంగానే నడుస్తోంది. అయితే ఈ మధ్య జబర్దస్ ఆర్టిస్ట్ ఆదిపైన కొంతమంది అమ్మాయిలు పలు కామెంట్లు చేస్తున్నారు. ఆదివల్లే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయామంటూ చెప్పిన వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులకు సినిమాల్లో అవకాశాలు దొరికాయి. మరికొంతమంది అయితే ఏకంగా హీరోలయ్యారు, దర్శకులు అయ్యారు. అంత పాపులర్ పొందిన ఈ షో. అయితే ఇందులో పంచ్‌ల కామెడీతో పాపులర్ అయిన ఆదిపై ఇటీవల పలువురు అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే హైపర్ ఆదివల్లే నేను జబర్దస్త్ మానేసా అంటూ ఇటీవల అనసూయ చెప్పడం సెన్సేషన్ అయింది. ఆది వేసే పంచ్‌ల వల్లే విసుగుపోయి జబర్దస్త్ మానేసా అంటూ అనసూయ చెప్పడం వైరల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు మరో బ్యూటీ కూడా ఆది వల్లే జబర్దస్త్ మానేసానంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ భామ ఎవరో కాదు ఈ మధ్యకాలంలో తన అందంతో కుర్రకారుని గుండెల్లో రైళ్లు పరుగెట్టుస్తున్ రీతూ చౌదరి.

రీతూకి సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది. ఇన్ ప్లుయెన్సర్ కూడా. రకరకాల వీడియోలు చేస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేస్తు ఉంటుంది. అయితే జబర్దస్త్‌లోనూ కొన్ని షోలు ఈ ముద్దుగుమ్మ చేసింది. అయితే ఆ తర్వాత సడన్‌గా అక్కడ నుంచి బయటకు వచ్చేసింది.

అసలు రీతూ సబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటన్నది చూస్తే.. ఆది వల్లే తాను బయటకు వచ్చాని ఆ ముద్దుగుమ్మ చెబుతోంది. మొదట్లో ఆదితో షో చేసేదాన్ని, కానీ ఆ తర్వాత ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు. నేను ఒక్కర్దానే అక్కడ ఎందుకుని, నేను కూడా తిరిగి వచ్చేసాను అంటూ రీతూ చెప్పుకొచ్చింది. ఇలా తాను బయటకు రాడానికి కారణ ఆది చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News