Chatrapathi Remake: "ఛత్రపతి" రీమేక్ లో హీరోయిన్ గా రెజిన..!!

Update: 2021-07-25 09:15 GMT

రెజిన కాసండ్ర (ఫైల్ ఫోటో)

Chatrapathi Remake: వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న "ఛత్రపతి" సినిమా రీమేక్ కి హీరోయిన్ గా రెజిన కాసండ్రని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో శ్రియా సరన్ హీరోయిన్ గా నటించిన ఈ పాత్రకి రెజిన అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ భామ ఈ మధ్య తెలుగు సినిమాల్లో అంతగా ఆఫర్లు లేక తమిళ సినిమాల్లో నటిస్తుంది. ఇక సినిమాతో హిందీలో రెజిన ఎంట్రీ ఇవ్వబోతుందనే చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని "రంగస్థలం" సినిమా షూటింగ్ చేసిన ప్రాంతంలోనే ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్నట్లుగా ఒక భారీ సెట్ ని నిర్మించారు.

మొదట్లో ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా కియార అద్వానిని అనుకున్న చివరికి చిత్ర యూనిట్ రెజిననే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ సినిమాకి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా తనిష్క్ బాగ్చి తన సంగీతాన్ని అందించనున్నాడు. ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఛత్రపతి రీమేక్ సినిమాతో అటు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో పాటు సూపర్ హిట్ కూడా సాధించాలనే తపనతో ఉన్నాడు. 

Tags:    

Similar News