IND vs NZ T20 Match: వ్యాక్సిన్ తీసుకున్న వారికే స్టేడియంలోకి ఎంట్రీ

* వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన జైపూర్ క్రికెట్ అసోసియేషన్

Update: 2021-11-11 06:55 GMT

వ్యాక్సిన్ తీసుకున్న వారికే స్టేడియంలోకి ఎంట్రీ (ఫైల్ ఫోటో)

IND vs NZ T20 Match - Jaipur: భారత్ - న్యూజిలాండ్ మధ్య త్వరలో జరగనున్న టీ20 సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ కి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) మ్యాచ్ వేదికలతో పాటు 16 మందితో కూడిన టీమిండియా జట్టును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 17న జైపూర్ వేదికగా జరగనున్న మొదటి టీ20 మ్యాచ్ కి గాను ఆ స్టేడియం కొత్త నిబంధన పెట్టింది.

ఇప్పటికే రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా​ నిబంధనల దృష్ట్యా కనీసం ఒక్క డోసు కరోనా వాక్సిన్ తీసుకున్న వారినే స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని మాస్కులు, శానిటేషన్, థర్మల్​ స్క్రీనింగ్ తప్పనిసరి చేశామని మహేంద్ర శర్మ చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా, కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక దాదాపుగా 8 ఏళ్ళ క్రితం జైపూర్ స్టేడియంలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తరువాత నవంబర్ 17న మొదటి టీ20 జరుగుతుండటంతో అభిమానులు కూడా ఈ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News