Ravi Teja Mass Jathara: ఆ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్.. ఇక రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..

రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరక్కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న భీమ్స్ రవితేజ ఓల్డ్‌ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను మాస్ జాతర కోసం మళ్లీ రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

Update: 2025-03-05 11:45 GMT

ఆ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్.. ఇక రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..

Ravi Teja Mass Jathara: టాలీవుడ్ మాస్ మహారాజా అనగానే మనకు గుర్తొచ్చేది రవితేజ. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మాస్ హీరోగా ఎదిగాడు. అందుకే తనను అంతా మాస్ మహారాజా అని పిలుస్తుంటారు. తన కెరీర్‌ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి కూడా రవితేజ వెనకాడలేదు. హీరోగా అవకాశాలు రావడం మొదలైన తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు. రవితేజ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ.

అతి తక్కువ టైంలో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడం రవితేజ స్టైల్. ముఖ్యంగా అతని సినిమాలో హీరోయిజంతో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. అందుకే రవి తేజ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.

రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరక్కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న భీమ్స్ రవితేజ ఓల్డ్‌ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను మాస్ జాతర కోసం మళ్లీ రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. రవితేజ సూపర్ హిట్ సినిమాల్లో ఇడియట్ ఒకటి. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సాంగ్స్‌ ‌ను ఇప్పటికీ యూత్‌ బాగా ఇష్టపడుతుంటారు.

ముఖ్యంగా చూపుల్తో గుచ్చి సాంగ్‌‌ కు యూత్‌లో ఉన్న క్రేజ్ వేరు. హీరోయిన్ వెంటపడుతూ తనను ఆటపట్టిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఈ పాటకు యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ యూత్‌లో ఈ సాంగ్‌కు క్రేజ్ తగ్గలేదు. అయితే రవితేజ మాస్ జాతర కోసం ఈ సాంగ్‌ను రీమిక్స్ చేయడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

గతంలో ధమాకా, రావణాసుర సినిమాలకు సంగీతం అందించిన భీమ్స్.. ఇప్పుడు మాస్ జాతర సినిమా సంగీతం అందించబోతున్నారు. మాస్ జాతర సినిమాతో రవితేజ కెరీర్‌లో బెస్ట్ మాస్ ఆల్బమ్ అందించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రవితేజ మూవీస్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఇడియట్ సినిమా నుంచి చూపుల్తో గుచ్చి సాంగ్‌ను రీమిక్స్ చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. అప్పట్లో ఈ పాట యూత్‌ను ఓ ఊపు ఊపింది. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Tags:    

Similar News