మెగాస్టార్ వెంట పడబోతున్న రవితేజ

Tollywood: దొంగ పాత్రలో మెగాస్టార్ పోలీస్ పాత్రలో రవితేజ

Update: 2022-07-31 05:29 GMT

మెగాస్టార్ వెంట పడబోతున్న రవితేజ

Tollywood: తాను ఇండస్ట్రీలోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు మాస్ మహారాజా రవితేజ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో రవితేజ మెగాస్టార్ తో కలిసి పలు సినిమాల్లో నటించారు. అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు రవితేజ. అయితే చాలాకాలం తర్వాత రవితేజ మళ్ళీ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్లో "వాల్తేరు వీరయ్య" అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి మరియు రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక దొంగ పాత్రలో కనిపించబోతుండగా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించనున్నారట. చిరంజీవి ని పట్టుకోవడానికి రవితేజ వేసే ఎత్తుగడల నేపథ్యంలోనే సినిమా కథ సాగుతుందని, వీరిద్దరి మధ్య జరిగే చేజ్ సినిమాకి ప్రాణమని తెలుస్తుంది. సినిమా రఫ్ కట్ బాగా నచ్చేసిన చిరంజీవి చిత్ర డైరెక్టర్ బాబి కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News