Nani: నానిని మూడుసార్లు రిజక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇంతకా బ్యూటీ ఎవరంటే
టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నాని ఒకరు.
Nani: నానిని మూడుసార్లు రిజక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇంతకా బ్యూటీ ఎవరంటే
Nani: టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నాని ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల బాటలో నిలకడగా దూసుకెళ్తున్నారు. కథానాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్‌ను అందుకుంటున్నారు.
ఇక నాని సరసన నటించేందుకు చాలా మంది కథానాయికలు ఆసక్తిగా ఉంటారు. కానీ ఓ ప్రముఖ హీరోయిన్ మాత్రం నాని సినిమాలో నటించే అవకాశం మూడు సార్లు వచ్చినా తిరస్కరించిందట. ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
నాని తొలిసారి ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా తెరపైకి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, అన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ ‘ఈగ’ సినిమా తర్వాత మాత్రం నాని కెరీర్ మలుపు తిరిగింది. సమంతతో కలిసి నటించిన ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి వరుస విజయాలతో నాని కెరీర్ రైడ్ మీద సాగుతోంది.
అయితే కెరీర్ ప్రారంభంలో నానికి పలు సవాళ్లు ఎదురయ్యాయట. చిత్రాలు విజయవంతమైనా, కొన్నిసార్లు హీరోయిన్స్ విషయంలో సమస్యలు ఎదురయ్యేవని టాక్. ఓ నటి మూడు సార్లు నానితో నటించే అవకాశం వచ్చినా అందుకోకపోవడం ఆశ్చర్యంగా మారింది.
ఆ నటి ఎవరో కాదు.. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత నానితో కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ, రష్మిక వాటిని తిరస్కరించిందట. ఒకసారి కాదు, మూడు సార్లు నాని సినిమాలకు నో చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె ఎందుకు నో చెప్పింది? అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నాని ఒకరు.